“రాధే శ్యామ్” కోసం ఓ రేంజ్ లో సిద్దమవుతున్న నేషనల్ ఈవెంట్!

Published on Dec 19, 2021 8:10 pm IST


ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ అనేలా మారిపోయింది. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేసే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. సాహో చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ఫలితం తో సంబంధం లేకుండా కలెక్షన్లు కురిపించింది. ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచుతూ వస్తున్న చిత్రం రాధే శ్యామ్. లవర్ బాయ్ గా మరొకసారి కనిపించనున్నారు ప్రభాస్.

ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూ వీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్ కి సంగీతం అందిస్తున్నారు. మిథున్, అమాల్ మల్లిక్, మనన్ భరద్వాజ్ లు హిందీ వెర్షన్ కి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ లో ఈ వేడుక జరగనుంది. నేషనల్ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ మొదటి సారి గా సన్నద్ధం అవుతోంది అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. నేషనల్ ఈవెంట్ తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :