ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా…”రాధే శ్యామ్” ట్రైలర్ మెటావర్స్ లో రిలీజ్!

Published on Mar 3, 2022 2:40 pm IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ను మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, వీడియో లకు, పాటలకు సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా విడుదల అయిన ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు 3 గంటలకు మెటావర్స్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ తరహా విడుదల ప్రపంచం లోనే మొట్ట మొదటి సారి అని తెలుస్తుంది. ఏదేమైనా ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ సరికొత్త స్టాండర్డ్స్ తో అటు ప్రేక్షకులకు, ఇటు అభిమానులకు మాంచి కిక్ ఇస్తుంది అని చెప్పాలి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :