“రాధేశ్యామ్” కోసం ఏకంగా 101 భారీ సెట్లు వేశారట..!

Published on Mar 8, 2022 12:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.

ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్లను వేసినట్టు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. మేజర్ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రబృందం ఇటలీ వెళ్లింది. అయితే కరోనా కారణంగా మధ్యలోనే ఇండియాకి తిరిగివచ్చేశారు. దీంతో హైదరాబాద్‌లోనే ఇటలీ నేపథ్యంతో కూడిన సెట్స్ వేసి షూటింగు పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించుకుని, ఇటలీ నేపథ్యంలో సెట్లను నిర్మించారు. అయితే ఎక్కడా కూడా ఇది ఇటలీ కాదు అనే ఆలోచన రాదని, సెట్ వర్క్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.

సంబంధిత సమాచారం :