రాధే శ్యామ్ యూఎస్ ప్రీ సేల్స్ గట్టిగానే!

Published on Mar 10, 2022 11:30 am IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. యూ వీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 11 వ తేదీన భారీగా విడుదల కానుంది. బుకింగ్స్ మొదలైన అన్ని చోట్ల ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల కూడా బుకింగ్స్ గట్టిగానే అవుతున్నాయి. యూ ఎస్ లో ఇప్పటి వరకు 600కే డాలర్ల కి పైగా ప్రీ సేల్స్ ద్వారా బుక్ అయినట్లు తెలుస్తోంది.

పలు చోట్ల ఇంకా థియేటర్స్ కౌంట్ పెరుగుతూ ఉండటం తో ఇంకా పూర్తి డీటైల్స్ రావాల్సి ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :