వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యిన “రాధే శ్యామ్” సరికొత్త ప్రమోషన్స్!

Published on Dec 29, 2021 12:01 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ “రాధే శ్యామ్”. ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ వేడుక కలగలిపి ఏ రేంజ్ లో చేసారో చూసాము.

ఇక ఇప్పుడు మేకర్స్ ఆఫ్ లైన్ లో సాలిడ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. అది కూడా మహా నగరం విశాఖపట్నం నుంచి “రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్” పేరిట ఈ సరికొత్త ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. దీని కోసం గాను ఒక స్పెషల్ వాహనాన్ని రెడీ చేసి దానిని అభిమానుల చేతులు మీదుగానే లాంచ్ చేయించారు.

అలాగే ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇక మీద ప్రతి అప్డేట్ ని అభిమానులతోనే లాంచ్ చేయిస్తారట. అలానే సినిమా రిలీజ్ కి వారం ముందుగా అంటే జనవరి 7 నుంచి ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఈ సినిమాని ప్రెజెంట్ చెయ్యడానికి గాను సిద్ధం అవుతున్నాడట.

సంబంధిత సమాచారం :