కన్ఫర్మ్..”రాధే శ్యామ్” నెక్ట్స్ సాంగ్ పై కంప్లీట్ డీటెయిల్స్ ఇవే.!

Published on Feb 22, 2022 7:11 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అత్యంత ఆద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేమ ప్రళయం కాంబో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో షురూ చేసిన ఈ సినిమాలో పాటలు కూడా ఏ రేంజ్ హిట్ అయ్యాయో చూసాము. ముఖ్యంగా అయితే హిందీ ఆల్బమ్ రాధే శ్యామ్ నుంచి భారీ హిట్ అయ్యింది.

ఇక రోజులు తక్కువ ఉండడంతో నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏమిటి అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తుండగా అది కూడా సాంగ్ అప్డేట్ నే అని గట్టి టాక్ ఉండగా ఇప్పుడు ఆ సాంగ్ ఏంటో ప్రముఖ సింగర్ ఆర్మాన్ మాలిక్ కన్ఫర్మ్ చేసాడు. ఈ సాంగ్ హిందీలో అవైటెడ్ గా ఉన్న మరో బ్యూటిఫుల్ నెంబర్ “జాన్ హై మేరీ” కాగా దీని అప్డేట్ ని అతి త్వరలో అందిస్తామని చెబుతున్నాడు. అలాగే ఇంకో కీలక పోస్ట్ లో అయితే టైం డేట్ కూడా పోస్ట్ చేసి టీజ్ చేస్తున్నాడు. దాని ప్రకారం అయితే ఈరోజే ఫిబ్రవరి 22 న రివీల్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి వేచి చూడాలి దీనిలో ఏం అర్ధం ఉందో, ఈ అవైటెడ్ అప్డేట్ వచ్చేది ఈరోజేనా కాదా అనేది.

సంబంధిత సమాచారం :