ఓటీటీలోకి “రాధేశ్యామ్‌” కాస్తంత ముందుగానే రాబోతుందా?

Published on Mar 15, 2022 1:30 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్లపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రాధేశ్యామ్‌ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజైన 4 వారాల తరువాతే ఓటీటీలో విడుదల చేయాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఈ లెక్కన ఏప్రిల్ 11 తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉండటంతో ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కి తీసుకొస్తే బాగుంటుందని అమెజాన్ యాజమాన్యం ఆలోచిస్తుందట. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :