“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..!

“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..!

Published on Dec 14, 2021 11:06 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 23వ తేదిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకను జరపనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు