“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అభిమానులే అతిథులు..!

Published on Dec 18, 2021 3:02 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా విడుదలైన ‘సంచారి’ పాట కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ వేడుకలో 5 భాషలకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :