‘రాధేశ్యామ్’ వినూత్నమైన ఐడియా.. దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్..!

Published on Feb 27, 2022 1:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వినూత్నమైన ఐడియాతో వచ్చారు దర్శక నిర్మాతలు.

అయితే జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్‌గా ఓ విష‌యాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

సంబంధిత సమాచారం :