బిగ్ అనౌన్స్మెంట్..”రాధే శ్యామ్”రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Jul 30, 2021 9:52 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “రాధే శ్యామ్” సినిమానే అని చెప్పాలి. ఎప్పుడో మొదలు కాబడిన ఈ చిత్రం ఎట్టకేలకు మొన్నటితో షూట్ ను కంప్లీట్ చేసుకుంది. మరి దీనితో దర్శకుడు రాధా కృష్ణ అధికారిక అప్డేట్ కూడా ఇచ్చాడు. మరి ఆ అప్డేట్ కం బిగ్ అనౌన్స్మెంట్ ని మేకర్స్ ఇప్పుడు రివీల్ చేసేసారు.

నిజానికి ఈరోజు జూలై 30న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా వల్ల చెయ్యలేకపోయామని తెలిపారు. మరి ఈ రిలీజ్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఫిక్స్ చేసి ప్రకటించారు. దీనితో ఈ బిగ్గెస్ట్ ట్రీట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందని చెప్పాలి. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.

అయితే ఈ రిలీజ్ డేట్ కొత్త పోస్టర్ లో సినిమా నేపథ్యాన్నీ కూడా మేకర్స్ పొందుపరిచారు. ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ లో రాశుల గుర్తులు ఆ చుట్టూ ఇటలీ నగరంను పొందుపరిచారు. మొత్తానికి మాత్రం మంచి ఆసక్తికర కాన్సెప్ట్ కి అద్భుతమైన ప్రేమకథను జోడించిన ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. మరి మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమాకి వర్క్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :