“రాధే శ్యామ్” రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడేనా.?

Published on Jul 20, 2021 10:01 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ అద్భుత ప్రేమ కావ్యంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే మరి అన్నీ బాగుండి ఉంటే ఇంకో పది రోజుల్లోనే విడుదల కావాల్సిన సినిమా ఇది కానీ కరోనా రెండో వేవ్ మూలాన వెనక్కి వెళ్లిన అనేక చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

అయితే ఈ భారీ చిత్రం ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యి మళ్ళీ పలు సన్నివేశాల నిమిత్తం రీషూట్స్ చేస్తున్నారు. అయితే మరి ఎలాగో ఇప్పుడు ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది అని అర్ధం అయ్యింది. మరి కొత్త విడుదల తేదీ ఏమిటి అన్న దానిపై కొన్నాళ్లుగా ఆసక్తి నడుస్తుంది. మరి ఆ డేట్ ఇప్పుడు నడుస్తున్న బ్యాలన్స్ షూట్ కంప్లీట్ అయ్యాక వస్తుంది అన్నట్టుగా టాక్. ఇది వరకు దసరా రేస్ లో ఈ చిత్రం నిలవొచ్చని టాక్ ఉంది. మరి ఆ సమయానికే వస్తుందా లేక మారుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :