రికార్డు గ్రాస్ తో స్టార్ట్ అయ్యిన “రాధే శ్యామ్” బాక్సాఫీస్ హంట్.!

Published on Mar 12, 2022 3:04 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ విజువల్ గ్రాండియర్ సినిమా ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూపించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్త వసూళ్లు ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూడగా ఇప్పుడు ఈ భారీ సినిమా డే 1 కి గాను ప్రపంచ వ్యాప్తంగా అదిరే వసూళ్లను కొల్లగొట్టింది.

ఈ కరోనా ప్యాండమిక్ అనంతరం భారీ స్థాయిలో మొదటి రోజు 79 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమాగా “రాధే శ్యామ్” రికార్డు ఫిగర్ సెట్ చేసి బాక్సాఫీస్ హంట్ ని స్టార్ట్ చేసింది. మరి ఇది ఒక సాలిడ్ ఫిగర్ అని చెప్పాలి. అలాగే ఈ వారాంతంలో కూడా ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని అందుకుంటుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పని చేయగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :