“రాధే శ్యామ్” సూపర్బ్ ప్లానింగ్..అందుకే ఈ లేట్.!?

Published on Nov 25, 2021 10:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”. స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సన్నద్ధం అవుతుంది. అయితే కొన్ని కీలక అప్డేట్స్ పరంగా మాత్రం సినిమా నుంచి కొన్ని అప్డేట్లు లేట్ గానే వస్తున్నాయి.

సౌత్ ఇండియన్ సినిమా దగ్గర వెర్షన్ కి మరియు హిందీలో వెర్షన్ కి సెపరేట్ సెపరేట్ వర్క్స్ జరుగుతున్నాయని టాక్ ఉంది. అయితే ఈ ప్లానింగ్ నిజమేనట. అందుకే సౌత్ వెర్షన్ సాంగ్ మొదట వచ్చినా హిందీ వెర్షన్ లేట్ అవుతుందని తెలుస్తుంది. అలాగే రెండు భాషల్లో కూడా డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉండబోతుంది అని కూడా టాక్.

అయితే ఇది మాత్రం సినిమా చూసే వాళ్ళకి కాస్త ప్రెజెంటేషన్ లా ఉంటుందని చెప్పాలి. మరి సాంగ్స్ వరకే ఈ ప్లానింగ్ ఉంటుందా లేక లేక సన్నివేశాలను కూడా రాధా ఇలా డిజైన్ చేశాడా అనేది వేచి చూడాలి. మరి ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే జనవరి 14న 7 భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :