సైలెంట్ సునామీ సృష్టిస్తున్న “రాధే శ్యామ్” టీజర్.!

Published on Oct 24, 2021 8:13 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్”. ప్రభాస్ నుంచి మరో మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం నుంచి నిన్ననే మరో మోస్ట్ అవైటెడ్ అప్డేట్ టీజర్ లాంచ్ అయ్యింది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్ లో ఏ టీజర్ కి రాని విధంగా భారీ వ్యూస్ ను సొంతం చేసుకొని దూసుకెళ్తుంది.

జస్ట్ 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ కి పైగా ఈ టీజర్ కి వచ్చేసాయి. దీనిని బట్టి ప్రభాస్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎంత ఆకలిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మరో ఆశ్చర్యకర విషయమేమిటంటే టీజర్ మొత్తం సైలెంట్ గా సింపుల్ గా ఉంది కానీ దాని రిజల్ట్ మాత్రం ఇంత వైలెంట్ గా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. మొత్తానికి మాత్రం ఈ టీజర్ తో ప్రభాస్ సైలెంట్ సునామినే సృష్టించాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :