మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా “రాధే శ్యామ్” నుంచి వీఏ టీజర్..!

Published on Oct 23, 2021 11:15 am IST

ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అయినటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావున దేశ వ్యాప్తంగా కూడా ప్రభాస్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ బిగ్గెస్ట్ డే స్పెషల్ గా తాను నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” నుంచి టీజర్ ను మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన ఈ టీజర్ నిజంగా వరల్డ్ క్లాస్ లెవెల్లోకి ఉందని చెప్పాలి.

ప్రభాస్ తాను చేసిన పాత్రను పరిచయం చేసుకుంటూ వెరీ ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసిన ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది. మనుషుల భవిష్యత్తు తెలిసిన వాడిగా వారి చేతి రేఖలతో రూపురేఖలను ముందు గానే పసిగట్టగలిగే వాడిగా తన రోల్ ని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఇక అలాగే విజువల్స్ అండ్ ప్రభాస్ లుక్స్ కి వస్తే అవి ఇంకా బాగున్నాయని చెప్పొచ్చు.

బ్యాక్గ్రౌండ్ లో చూపించిన ప్రతీ విజువల్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు ఈ టీజర్ ని మరింత ఎలివేట్ చేసాయి. అలాగే లాస్ట్ ఐదారు సెకండ్స్ లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. ఓవరాల్ గా అయితే ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రాధే శ్యామ్ టీజర్ అనిపిస్తుంది. ఇక మున్ముందు ఎలాంటి విజువల్ ట్రీట్ ను ఈ చిత్రం నుంచి వస్తాయో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More