“రాధేశ్యామ్” తెలుగు వెర్షన్‌కి సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

Published on Mar 4, 2022 12:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచిన మేకర్స్ నిన్న ట్రైలర్‌ని విడుదల చేయగా.. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ సెన్సార్‌ని పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్‌ని పొందింది. అంతేకాకుండా ఈ సినిమా 2 గంటల 18 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాకు డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :