“రాధేశ్యామ్‌” ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న గ్రాండ్ విజువల్స్..!

Published on Dec 23, 2021 10:07 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తూ ఈ సినిమా ట్రైలర్‌ని అన్ని భాషల్లో కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో 1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా లావిష్ లుక్‌లో కనిపించగా, పూజాహెగ్డే ప్రేరణగా ఎంతో అందంగా కనిపించింది. ముఖ్యంగా ప్రభాస్, పూజా మధ్య ఉన్న రొమాంటిక్ లవ్‌ట్రాక్‌ని ఎంతో బ్యూటిఫుల్‌గా చూపించారు. కథలోని మెయిన్ థీమ్‌ ని వివరిస్తూ చూపించిన విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా అనిపించాయి. పరమహంస పాత్రలో కృష్ణంరాజు అద్బుతంగా కనిపించారు.

ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధానబలంగా నిలిచింది. ఇక ట్రైలర్‌లో చివరగా విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీయగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? అని చెప్పిన డైలాగ్‌లు సినిమాలో ఉన్న లోతైన ప్రేమ కథను ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. ఏదేమైనా ఈ ట్రైలర్‌ని చూశాక సినిమాపై అభిమానుల, ప్రేక్షకుల అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :