“రాధే శ్యామ్” హిందీ ఆల్బమ్ పీక్స్..ఓ రేంజ్ లో ఉన్న రిలీజ్ కాని సాంగ్!

Published on Feb 13, 2022 9:02 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు సహా పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం హిందీ ఆడియెన్స్ కూడా ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో హిందీలో ఈ సినిమా పాటలకు గాని ట్రైలర్ కి గాని వచ్చిన రెస్పాన్స్ చెబుతుంది.

మరీ ముఖ్యంగా ఈ సినిమాకి హిందీ వెర్షన్ లో తీసుకున్న కేర్ మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. హిందీలో స్పెషల్ గా డిజైన్ చేసిన సాంగ్స్ అయితే బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ ని ఒక ఊపు ఊపాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో హిందీ సాంగ్ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా అధికారికంగా విడుదల కానీ ఆ సాంగ్ హిందిలో లైవ్ పెర్ఫామెన్స్ ని అందించారు.

అయితే ఇది మాత్రం వినడానికి మరింత బ్యూటిఫుల్ గా ఉందని చెప్పాలి. ఇక ఇది గాని అఫీషియల్ గా రిలీజ్ అయ్యాక మాత్రం మరో పెద్ద చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ సాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లోనే పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి హిందీలో మిథున్ మరియు మనన్ భరద్వాజ్ లు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :