‘రాధే శ్యామ్’ నుంచి అప్డేట్ వచ్చేస్తుందోచ్..!

Published on Jul 29, 2021 10:56 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియన్ సినిమా జూలై 30వ తేదినే రిలీజ్ కావాల్సి ఉన్నా క‌రోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని తాజాగా దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో సినిమా అప్డేట్, రిలీజ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో రేపు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నట్టు తాజాగా యూవీ క్రియేషన్స్ ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. జూలై 30వ తేదిన ‘రాధే శ్యామ్’ థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా అది సాధ్యపడలేదని, అయితే రేపు ఉదయం 9:18 నిమిషాలకు ఓ అప్డేట్‌ని ఇవ్వబోతున్నామని ప్రకటించారు. అయితే ఈ అప్డేట్‌లో కొత్త రిలీజ్ డేట్‌ని ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :