అక్కడ రికార్డ్ లొకేషన్స్‌లో రిలీజ్ కాబోతున్న “రాధేశ్యామ్..!

Published on Feb 26, 2022 12:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ మళ్లీ షురూ చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం యూఎస్‌లో అత్యధిక లొకేషన్స్‌లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా అక్కడ 1116 ప్లస్ లొకేషన్లలో, 3116 ప్లస్ స్క్రీన్స్‌పై, 11116 ప్లస్ షోలు పడబోతున్నాయి. అయితే యూఎస్‌లో ఇన్ని లొకేషన్స్‌లో విడుదలవుతున్న తొలి హీరో ప్రభాస్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి జస్టీన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :