“రాధేశ్యామ్” తెలుగు ట్రైలర్‌లో మిస్టేక్.. సరిచేసి మళ్లీ అప్‌లోడ్ చేసిన మేకర్స్..!

Published on Mar 2, 2022 11:30 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడును పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా నేడు రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

అయితే ఈ రిలీజ్ ట్రైలర్‌లో ఓ మిస్టేక్ రావడంతో దానిని సరిచేసి తాజాగా మరో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తొలుత విడుదల చేసిన తెలుగు ట్రైలర్‌లో ఓ ఫ్రేమ్ లో కృష్ణంరాజుకి బదులుగా సత్యరాజ్ కనిపించాడు. తెలుగులో ప్రభాస్ గురువు పాత్రలో కృష్ణంరాజు నటించగా, మిగిలిన భాషల్లో ఆ పాత్రలో సత్యరాజ్ కనిపిస్తారు. అయితే టెక్నికల్ ఎర్రర్ కారణంగానే తెలుగు ట్రైలర్‌లో కృష్ణంరాజుకి బదులుగా సత్యరాజ్ కనిపించారని క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఆ మిస్టేక్‌ని సరిచేసి కొత్త తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు.

సంబంధిత సమాచారం :