సినిమా ఇండస్ట్రీ పై బోల్డ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !

సినిమా ఇండస్ట్రీ పై బోల్డ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !

Published on Nov 13, 2022 6:42 PM IST

హీరోయిన్ రాధికా ఆప్టే బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు అవకాశాలు రావడంలో వయసు ప్రభావం చూపిస్తోందని తాజాగా రాధికా ఆప్టే కామెంట్స్ చేసింది. ఇంకా రాధికా ఆప్టే ఏం మాట్లాడింది అంటే.. ‘బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ చిత్రాల్లో యువ నటీమణులకే ఎక్కువగా ఛాన్స్ లు వస్తుంటాయి. హీరోయిన్‌కు కావాల్సిన లక్షణాలు మీకు లేవు అనే కామెంట్స్ చాలా మంది ఎదుర్కొంటున్నారు.

లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం విదేశాల్లోనూ ఉంది. ఇప్పుడిప్పుడే దీనికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు’’ అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. ఇక రాధికా ఆప్టే ఆ మధ్య ఓ బోల్డ్ వీడియోతో సంచలనం అయ్యింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పైగా ఆమెను డీసెంట్ లుక్స్ లో తెలుగు దర్శకులు చూపించారు. దాంతో తెలుగు వాళ్లల్లో ఆమె పై ఒక ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ అయింది. అలాంటి డీసెంట్ హీరోయిన్ నుంచి బోల్డ్ గెటప్స్ చూసే సరికి మొదట అందరూ షాక్ అయ్యారు. దానికి తోడు రాధికా ఆప్టే ఇలా మధ్యమధ్యలో సరికొత్త బోల్డ్ కామెంట్స్ తో షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు