అన్‌స్టాపబుల్2: అలనాటి నటి తో అలరించనున్న బాలయ్య!

అన్‌స్టాపబుల్2: అలనాటి నటి తో అలరించనున్న బాలయ్య!

Published on Nov 17, 2022 2:18 AM IST


నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి మరియు అతని టాక్ షో అన్‌స్టాపబుల్ 2 తో బిజీగా ఉన్నారు. ఆహా వీడియో లో ఈ టాక్ షో నటుడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్ కి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సురేష్ రెడ్డి అతిథులు గా రానున్నారు అని షో నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పుడు ఈ షోకి అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ రానున్నట్లు టాక్.

OTT ప్లాట్‌ఫాం అందుకు సంబంధించిన హింట్ ను ఇచ్చింది. స్వాతిముత్యం అయినా ఆమె, స్వాతికిరణం అయినా తనే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. అభిమానులు వెంటనే తమ సమాధానాలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. మరో పోస్ట్ లో రాధికా శరత్ కుమార్ పవర్ ప్యాక్డ్ సెల్ఫీ ను పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాధిక షోకి వస్తున్న వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు