సూపర్ స్టార్ విలువైన సలహాలు ఇచ్చారట

Published on Sep 25, 2023 12:11 am IST

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. ఈ ముగ్గురిని నా జీవితంలో నేను ఎప్పటికి మర్చిపోలేనని లారెన్స్ అన్నారు. చిరంజీవి, రజనీకాంత్‌ల ప్రభావం తనపై ఎక్కువగా ఉందని, అందుకే వారిని అనుకరించకుండా కష్టపడుతున్నానని లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇక చంద్రముఖి 2 కోసం రజినీ సార్ తనకు విలువైన సలహాలు ఇచ్చారు’ అంటూ లారెన్స్ కామెంట్స్ చేశాడు.

కంగనా రనౌత్‌ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఎంఎం కీరవాణితో కలిసి పనిచేయడం తనకు ఆశీర్వాదమని లారెన్స్ అన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని లారెన్స్ తన ప్రసంగాన్ని ముగించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఇంతకీ చంద్రముఖి 2 తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :