రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 10, 2023 6:05 PM IST

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కథిరేషన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రుద్రన్. కాంచన 3 తర్వాత దాదాపు ముడేళ్లు గ్యాప్‌ అనంతరం లారెన్స్ ఈ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. తెలుగులో రుద్రుడు టైటిల్ తో ఏప్రిల్ 14న ఈ మూవీ విడుదలై యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. లారెన్స్‌కు జోడీగా ప్రియా భ‌వానీ శంక‌ర్ ఇందులో న‌టించింది.

శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో నటించారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులు దక్కించుకున్న సన్ నెక్స్ట్ సంస్థ, మూవీని మే 14న తమ ఓటిటి లో తెలుగు, తమిళ భాషల్లో ప్రసారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. మరి వెండితెర పై పెద్దగా ఆకట్టుకోని ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు