సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్ ను సోషల్ మీడియాలో డిజిటల్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం లో రాఘవ లారెన్స్ మరియు ఎస్.జే. సూర్య లు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పై మంచి హైప్ ఉంది. అయితే సూపర్ స్టార్ టీజర్ ను రిలీజ్ చేయడం తో మరికొంత పాజిటివ్ టాక్ వచ్చింది.
ఈ టీజర్ ను రిలీజ్ చేయడం పట్ల రాఘవ లారెన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ, సూపర్ స్టార్ మహేష్ బాబు కి థాంక్స్ తెలిపారు. ఇది చాలా స్పెషల్ అని, మహేష్ చేస్తున్న సోషల్ సర్వీస్ గురించి ప్రశంసించారు. అంతేకాక మంచి రీజన్ తో మహేష్ తో చేతులు కలపడానికి రెడీ గా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
https://x.com/offl_Lawrence/status/1701454240202551633?s=20