టాలీవుడ్ సహా కోలీవుడ్ లో మంచి పేరున్న మల్టీ టాలెంటెడ్ నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో మన టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మతో గత కొన్నాళ్ల ఓ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఓ భారీ ప్రాజెక్ట్ ని ఇపుడు తాము అనౌన్స్ చేశారు.
రాఘవ లారెన్స్ హీరోగా మొదటిసారి ఓ భారీ హిస్టారికల్ డ్రామాని తెరకెక్కించనున్నారు. మహాభారతంలో గల వీరుల్లో ఒకరైన కర్ణుని పై ‘మహావీర్ కర్ణ’ అనే ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో ఇపుడు వారు అనౌన్స్ చేశారు. ఇక దీనిపై వదిలిన ఫస్ట్ లుక్ లో లారెన్స్ కర్ణునిగా బాగా సెట్ అయినట్టు కనిపిస్తున్నాడు.
ఇది మాత్రం తన ఫ్యాన్స్ కి ఒక ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి. ఖిలాడి, రాక్షసుడు సినిమాలతో టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న దర్శకుడు రమేష్ వర్మ ఈ మైథాలజీ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో కూడా చూడాలి. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ 2027లో థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
