టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రాల్లో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ‘ధూం ధాం’ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తుండగా సాయి కిషోర్ మచ్చా డైరెక్ట్ చేస్తున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ దక్కగా.. తాజాగా ఈ మూవీలోని ‘కుందనాల బొమ్మ’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఈ సాంగ్‌ను లాంఛ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందమైన సాహిత్యానికి, సింగర్ శ్రీకృష్ణ తన గాత్రంతో ప్రాణం పోశారు. గోపీ సుందర్ క్యాచీ బీట్స్‌తో ఈ పాటను కంపోజ్ చేశారు.
వినసొంపుగా ఉన్న ఈ పాట శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి