40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన హీరో కమ్ డైరెక్టర్ !

‘అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు, టైగర్’ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి హీరో సుశాంత్ తో ‘చి. ల.సౌ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రుహని హీరొయిన్ గా పరిచయం కాబోతోంది. ‘మెంటల్ మదిలో’ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ విహారి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.

లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా మొదలైనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి తక్కువ టైం లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ప్రీ లుక్ కు మంచి స్పందన లభించింది. సుశాంత్ ఈ మూవీ తో విజయం సాదించడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హీరోగా సక్సెస్ అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా ఈ సినిమాతో హిట్ కొట్టాలని కోరుకుందాం.