‘రణబాలి’ గ్లింప్స్ : AI కామెంట్స్‌పై దర్శకుడు క్లారిటీ..!

Ranabaali

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి'(Ranabaali ) చిత్ర టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్ అద్భుతంగా ఉండటంతో, నెటిజన్లు దీనిని ఏఐ తో రూపొందించారని సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. సినిమా కథాంశాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ విజువల్ అసెట్‌పై వస్తున్న ప్రశంసలతో పాటు ఏఐ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ప్రచారానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చెక్ పెట్టారు. ‘రణబాలి’ వీడియోను ఏఐతో తయారు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఫ్రేమ్‌ను పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేశామని, ఈ గ్లింప్స్‌ను సిద్ధం చేయడానికి తమ బృందానికి నెలల సమయం పట్టిందని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ సాయం లేకుండానే ఇంతటి హై-క్వాలిటీ ప్రమోషనల్ వీడియోను అందించినందుకు అభిమానులు దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్-అతుల్ ద్వయం ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం 2026, సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version