అప్పుడు ప్రస్థానం ఇప్పుడు రిపబ్లిక్… రాజ్ అండ్ డికే కీలక వ్యాఖ్యలు!

Published on Sep 24, 2021 1:22 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మేరకు టాలీవుడ్ సీని ప్రముఖులు, పలువురు సినీ పరిశ్రమ కి చెందిన వారు ట్రైలర్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఫ్యామిలీ మాన్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజ్ అండ్ డీ కే ఈ మేరకు ట్రైలర్ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది అంటూ దేవాకట్టా రిపబ్లిక్ ట్రైలర్ ను షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల రాజ్ అండ్ డీ కే స్పందిస్తూ, అప్పుడు ప్రస్థానం ఇప్పుడు రిపబ్లిక్ అంటూ చెప్పుకొచ్చారు.దేవకట్టా కి యూనిక్ వాయిస్ ఉందని, ట్రైలర్ అదిరింది, సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అంతేకాక సాయి ధరమ్ తేజ్ బాగా చేశారు అంటూ ట్రైలర్ చూసి అన్నారు. ఈ మేరకు రాజ్ అండ్ డీ కే కి దేవాకట్టా థాంక్స్ తెలిపారు. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ను అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :