యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో పక్కా కమర్షియల్ చిత్రం గా “రాజ్ కహానీ”…టీజర్ రిలీజ్!

యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో పక్కా కమర్షియల్ చిత్రం గా “రాజ్ కహానీ”…టీజర్ రిలీజ్!

Published on May 25, 2022 10:00 AM IST


భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజ్ కహానీ. ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ రాజ్ కహానీ టీజర్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు మాట్లాడుతూ, “చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడై ప్రేమలోని వివిధ కోణాలను మంచి చెడులను అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రమే రాజ్ కహానీ. హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాలలో తెరకెక్కించబడిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ, “పక్కా కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం సమకూరుస్తున్నాడు. పాటలన్ని బాగా వచ్చాయి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం యూత్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది” అని అన్నారు.

రాజ్ కార్తికెన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, కె ఎ పాల్ రాము, మధుమణి, శ్రీలక్ష్మి, డీఎంకే మురళి, పుష్ప మల్లారెడ్డి, అర్జున్ రెడ్డి సుందరం, మహేంద్రనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజు, రచన, దర్శకత్వం రాజ్ కార్తికేన్, సంగీతం మహిత్ నారాయణ్, డి.ఓ.పి యస్.యస్.వి. ప్రసాద్, ఎడిటర్ సెల్వ కుమార్, పి.ఆర్.ఓ హర్ష లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు