మళ్లీ వార్తలెక్కిన శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా !

Published on Jan 17, 2022 8:22 am IST

బాలీవుడ్‌ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా గతేడాది అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్‌ పై విడుదల అయిన రాజ్‌ కుంద్రా తన ఇన్‌స్టాలోని పోస్టులను తొలగించాడు, అలాగే పూర్తిగా తన ఇన్‌స్టా ఎకౌంట్ ను కూడా డిలీట్ చేశాడు. కాగా తాజాగా మళ్లీ రాజ్‌ కుంద్రా సోషల్‌ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఇంతకీ రాజ్ కుంద్రా ఎవరిని ఫాలో అవుతున్నాడా ? అని నెటిజన్లు చెక్ చేస్తే..

ఆయన ఫాలో అవుతుంది బాంద్రాలోని ఒక సీ ఫుడ్‌ రెస్టారెంట్‌ ను. ఇక రాజ్ కుంద్రా కొత్త అకౌంట్‌కు కూడా సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం నిజంగా విశేషమే. ఇంతకీ రాజ్‌ కుంద్రా బాంద్రాలోని సీ ఫుడ్‌ రెస్టారెంట్‌ ను ఎందుకు ఫాలో అవుతున్నాడు అంటే.. ఆ రెస్టారెంట్‌లో ఆయనకు భాగస్వామ్యం ఉంది. అందుకే ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. అన్నట్టు రాజ్‌ కుంద్రా పై ఉన్న కేసు మాత్రం న్యాయస్థానంలో ఇంకా కొనసాగుతూనే ఉంది.

సంబంధిత సమాచారం :