‘ఇంట్రస్టింగ్ ప్లే’లో రాజ్ తరుణ్ !

‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్ ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. నాగచైతన్య పిలిచి మరి ఆఫర్ ఇచ్చినా.. ‘ఒక లైలా కోసం’ అంటూ ప్లాప్ చిత్రాన్ని తీశాడు. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకూ రాజ్‌ తరుణ్‌ హీరోగా కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతుందని తెలుస్తోంది.

ముఖ్యంగా లవ్ స్టోరీలో ఫుల్ ఫన్ తో ఉంటుందట. వెరీ యాక్టివ్ గా ఉండే ఓ కుర్రాడు తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని ఇష్టపడి.. ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో జరిగే డ్రామా సినిమాలో చాల బాగుంటుందట. ఇక ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌ స్టాప్‌ గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.