సాలిడ్ ఎంటర్టైనింగ్ గా ‘అనుభవించు రాజా’ టీజర్.!

Published on Sep 23, 2021 10:13 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. తన కెరీర్ ఆరంభంలోనే మంచి హిట్స్ అందుకున్న తరుణ్ తర్వాత నెమ్మదించాడు. కానీ ఇప్పుడు తన సినిమాల ఎంపికే మారిపోయింది అని చెప్పాలి. సరికొత్త కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తున్నాడు. అలా ఇది వరకు వచ్చిన స్టాండప్ రాహుల్ తో మంచి ఆసక్తి రేపిన రాజ్ తరుణ్ ఇప్పుడు దానికి కంప్లీట్ డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు.

అదే “అనుభవించు రాజా”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. అయితే ఈ టీజర్ మాత్రం సాలిడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి. స్టార్టింగ్ లోనే ఒక పల్లెటూరి వాతావరణంని స్టార్ట్ చేసి ఫ్రెష్ ఫీల్ ని అందించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు.

ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా నేపథ్యం రాజ్ తరుణ్ రోల్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. టీజర్ కట్ ని అయితే దర్శకుడు శ్రీను గవిరెడ్డి చాలా ఎగ్జైటింగ్ గా తీశారు. ఇంకా ఇందులో విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఓవరాల్ గా అయితే మంచి ప్రామిసింగ్ గా ఈ టీజర్ కనిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో కాశీష్ ఖాన్, పోసాని తదితర నటులు నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :