ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ తో “అనుభవించు రాజా” ట్రైలర్.!

Published on Nov 17, 2021 10:10 am IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అనుభవించు రాజా”. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్రెడీ టీజర్ తోనే మంచి పాజిటివ్ వైబ్స్ ని తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న తరుణంలో ఈ ట్రైలర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే అప్పుడు టీజర్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపించిందో.. ఇప్పుడు దానితో పాటు మరింత డీటైలింగ్ ట్రైలర్ లో కనిపించింది. అలాగే రాజ్ తరుణ్ రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ కాశీష్ ఖాన్ తో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

అలాగే సిటీ నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించిన స్టోరీ సీన్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా అజయ్ మరియు రాజ్ తరుణ్ ల మధ్య క్లాష్ వాటితో సందర్భానుసారం జెనరేట్ అయ్యే కామెడీలతో మంచి ఫన్ ఫిల్లెడ్ గా ప్రామిసింగ్ గా ఈ ట్రైలర్ అనిపిస్తుంది.

మరి రాజ్ తరుణ్ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే ఈ నవంబర్ 26న థియేటర్స్ లో చూడాల్సిందే. మరి ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి సినిమాస్ వారు తమ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మాణం వహించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :