ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: రాజ్ తరుణ్ – స్టేటస్ అనేది మన ముందు సినిమా సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది !


కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ప్రస్తుతం ఆయన చేసిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేమిటో మీరు చూడండి…

ప్ర) సినిమా రిలీజ్ పట్ల ఎగ్జైటింగా ఉన్నారా ?
జ) ఈ మధ్యే సినిమా చూశాను. రిలీజ్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాను. కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రం ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్ర) మరో రెండు సినిమాలతో పోటీగా పోటీగా వస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు ?
జ) నాకు కూడా మనోజ్ ఫోన్ చేసి మా సినిమాలు ఒకేసారి రిలీజవుతున్నాయని చెప్పాడు. నేను ఈ విషయాన్ని నిర్మాతలతో చర్చించలేదు. ఈ పరీక్షల సీజన్లో రిలీజ్ చేయడం తరువాత లాభిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయినా అన్ని సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది.

ప్ర) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి ?
జ) ఇందులో నాది బ్రతకడం కోసం కుక్కలను కిడ్నాప్ చేసే పాత్ర. చాలా మంది తెలిసిన నటులు ముఖ్యమైన పాత్రలు చేశారు. ప్రతి రోల్ బలంగా ఉంటుంది. ప్రతి పాత్ర ఎవరి దృష్టిలో వాళ్ళు హీరోలని ఫీలవుతుంటారు.

ప్ర) మిగిలిన నటుల గురించి చెప్పండి ?
జ) ఇందులో అర్బాజ్ ఖాన్ విలన్ పాత్ర చేశారు. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చినా ఆయన చాలా ఒదిగి ఉంటారు. ఒక అరగంట ఆయనతో మాట్లాడితే 20 నిముషాలు నవ్వుతూనే ఉంటాం.

ప్ర) హీరోయిన్ తో లిప్ లాక్ గురుంచి ?
జ) అది సినిమాలో రోమాంటిక్ యాంగిల్. కీలక సమయంలో వస్తుంది. దాని గురించి అంతగా మాట్లాడటానికి ఏం లేదు. అను ఇమ్మానుయేల్ చాలా బాగా నటించింది. ఆమె సినిమాకు మంచి బోనస్ అవుతుంది.

ప్ర) కుక్కలతో షూటింగ్ చేయడం ఎలా అనిపించింది ?
జ) వ్యక్తిగతంగా కుక్కలంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో 13 కుక్కలుంటాయి. వాటితో పని చేయడం చాలా బాగుంది. వాటి ద్వారా జనరేట్ అయ్యే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను తప్పక మెప్పిస్తుంది.

ప్ర) ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో మూడు సినిమాల కాంట్రాక్ గురించి ఏమంటారు ?
జ) అలాంటి కాంట్రాక్ట్స్ ఏమీ లేవు. అన్నీ రూమర్స్. నా నెక్స్ట్ సినిమా కూడా వాళ్లతో చేస్తున్నానంతే. కానీ వాళ్లతో నేనేదో కాంట్రాక్టులో ఉన్నట్టు వార్తలొచ్చాయి.

ప్ర) వాళ్ళు మీకేదో విల్లా గిఫ్ట్ ఇచ్చారనేది అబద్దమా ?
జ) అవును. విల్లా నేనే కొన్నాను. కానీ దాన్ని అనిల్ గారు, దిల్ రాజు గారు కట్టించారని న్యూస్ వచ్చింది. అదంతా నిజం కాదు. నాకెన్నాళ్ల నుండో విల్లా కొనాలనే ఆశ ఉంది. అది నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది.

ప్ర) ఇండస్ట్రీలో స్టేటస్ గురించి మీరేమనుకుంటున్నారు ?
జ) ఎవరైనా సరే మన ముందు సినిమాను బట్టే మనల్ని చూస్తారు. నేను అదే ఫార్ములాను నమ్ముతాను. ముందు సినిమా హిట్టయితేనే స్టార్ స్టేటస్ ఉంటుంది. నేను ఈ స్టేటస్ గురించి పెద్దగా పట్టించుకోను. నా నెక్స్ట్ సినిమాల మీదే దృష్టిపెడుతుంటాను.

ప్ర) మీరు ఫైల్యూర్స్ ని ఎలా తీసుకుంటారు ?
జ) ఒకసారి సినిమా రిలీజయ్యాక దాని గురించి ఆలోచించను. మనం మార్చలేని వాటి గురించి ఎంత ఆలోచించినా అది వృధానే. అందుకే తరువాతి సినిమాలేమిటనేది చూసుకుంటూ వెళ్తా.

ప్ర) ‘శతమానం భవతి’ సినిమా నుండి బయటకు ఆవడానికి కారణం ?
జ) ఆ సమయంలో నాకు మూడు సినిమాలు ఉన్నాయి. అందుకే చేయలేక బయటికొచ్చాను. అంతేగాని మిగతా వార్తలన్నీ ఒట్టి రూమర్స్. అందుకే నేను త్వరలో దిల్ రాజు గారితో ఒక సినిమా చేస్తున్నాను.

ప్ర) మీడియాలో మీరు చాలా యారొగెంట్ అనే వార్తలొస్తున్నాయి. ఏమంటారు ?
జ) నాకు బాగా గుర్తు ‘కుమారి 21 ఎఫ్’ ఇంటర్వ్యూకి చాలా లేట్ గా వెళ్ళాను. అప్పటి నుండి నేను యారొగెంట్ అని, క్రమశిక్షణ లేనివాడినని వార్తలొచ్చాయి. ఆరోజు లేటుగా వెళ్లడం నా చేతుల్లోలేదు. తర్వాత లాస్య విషయలో కూడా అదే జరిగింది. ట్విట్టర్ ద్వారా వాటిని క్లియర్ చేద్దామని అనుకున్నా. కానీ అప్పటికే ఆలస్యమైంది. అందుకేవాటి గురించి ఎక్కడా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?
జ) ఈ సినిమా తర్వాత ‘అందగాడు’ కూడా రిలీజుకు రెడీగా ఉంది. అది కాకుండా అన్నపూర్ణ స్థూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాని లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. అవి పూర్తవగానే దిల్ రాజుగారితో సినిమా అనౌన్స్ చేస్తాను.