“స్టాండప్ రాహుల్” నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా – రాజ్ తరుణ్

Published on Mar 17, 2022 3:00 am IST


యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం “స్టాండ్ అప్ రాహుల్”. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వర్షా బొమ్మాళి కథానాయికగా నటిస్తుంది. మార్చి 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సాగర్ కె చంద్ర తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ నిర్మాతలు మధు, భరత్ గార్లకి చాలా థ్యాంక్స్ అని అన్నారు. విజువల్స్ చాలా బాగా వచ్చయని, చాలా కష్టపడ్డామని అన్నారు. వర్ష గురుంచి చెప్పాలంటే ఈ సినిమాలో బాగా చేశానంటే సగం గ్రేట్ వర్షదే అని ఎప్పుడూ అనేవాడినని, ఇప్పుడు వర్ష అదే డైలాగ్ చెబుతుందని అన్నాడు.

ఇక శాంటో చాలా బాగా ఈ సినిమాని తెరకెక్కించాడని, నాకు ఎప్పటికీ ఈ సినిమా గుర్తిండిపోతుందని అన్నాడు. ఇక ఈ సినిమా బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా అని, ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను, మార్చి 18న థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని అన్నాడు.

సంబంధిత సమాచారం :