‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ ట్రైల‌ర్ లాంచ్ కు టైమ్ ఫిక్స్

‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ ట్రైల‌ర్ లాంచ్ కు టైమ్ ఫిక్స్

Published on Jul 1, 2024 8:30 PM IST

హీరో రాజ్ త‌రుణ్ గ‌తకొంత కాలంగా స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇక ఈ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుంది. ఈ సినిమాను ఏఎస్.ర‌వికుమార్ చౌద‌రి డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీ పోస్ట‌ర్స్, సాంగ్స్, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది.

కాగా, ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ ను లాంచ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను జూలై 2న ప్ర‌సాద్ ల్యాబ్స్ లో మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు లాంచ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర‌ యూనిట్ రూపొందిస్తోంది.

ఈ సినిమాలో మాల్వి మ‌ల్హోత్ర‌, మ‌న్నార చోప్రా హీరోయిన్లుగా న‌టిస్తోండ‌గా మార్కండ్ దేశ్ పాండే విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను మాల్కాపురం శివ కుమార్ ప్రొడ్యూస్ చేస్తుండ‌గా జెబి, భోలె శావ‌లి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు