మాస్, యాక్ష‌న్ క‌ల‌యిక‌గా ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ ట్రైల‌ర్

మాస్, యాక్ష‌న్ క‌ల‌యిక‌గా ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ ట్రైల‌ర్

Published on Jul 2, 2024 4:51 PM IST

రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ ఇప్పిటికే షూటింగ్ ప‌నులు ముగించుకుంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ఏఎస్.ర‌వికుమార్ చౌద‌రి తెర‌కెక్కించ‌గా, పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా రానుంద‌ని మేక‌ర్స్ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునే విధంగా క‌ట్ చేశారు చిత్ర యూనిట్. పిరికివాడిగా ఉండే హీరో, త‌న చుట్టూ ఏం జ‌రుగుతున్నా పట్టించుకోడు. అయితే హీరోయిన్ మాత్రం తిర‌గ‌బ‌డే టైప్, ఆమె కార‌ణంగా హీరో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాడా అనేది ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ గా ఉండ‌నున్న‌ట్లు ఈ ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఈ సినిమాలో మాల్వి మ‌ల్హోత్రా హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా మ‌న్నారా చోప్రా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌క్రంద్ దేశ్ పాండే విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా జెబి, భోలె శావ‌లి సంగీతాన్ని అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు