సంక్రాంతికి రానున్న రాజ్ తరుణ్ సినిమా !

18th, October 2017 - 06:33:26 PM

యంగ్ హీరోల్లో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న నటుల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఆయన చివరి చిత్రాలు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు’ వంటివి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకోవడంతో ఆయన తర్వాతి చిత్రం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. రాజ్ తరుణ్ కూడా ఆ అంచనాల్ని అందుకోవడానికి రెగ్యులర్ సినిమాల జోలికి పోకుండా కాస్త భిన్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు.

అలా ఆయన ఎంచుకున్న సినిమానే ‘రాజుగాడు’. ఈరోజే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అదే సీజన్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరోలుకూడా వస్తుండటంతో రాజ్ తరుణ్ సినిమా కాస్తంత ఎక్కువ అటెంజేషన్ దక్కించుకుంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జంటగా అమితారా దస్తూర్ నటిస్తోంది.