హిట్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ !

21st, December 2017 - 07:00:35 AM

ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి రాజ్ తరుణ్ తో సినిమా నిర్మించబోతున్నాడు. కుమారి 21 ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్య ప్రతాప్ పల్నాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను ఆధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతొంది.

ఈ ప్రాజెక్ట్ తో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ చెయ్యబోయే సినిమాను కూడా రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 గా రాజ్ తరుణ్ సినిమా తియ్యబోతున్న ఈ బ్యానర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశల ఉన్నాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ రాజు గాడు, రంగుల రాట్నం సినిమాల్లో నటించాడు. త్వరలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.