‘రంగుల రాట్నం’ లో రాజ్ తరుణ్ ఏం చేస్తాడు ?

8th, January 2018 - 11:36:13 AM

రాజ్ త‌రుణ్‌, చిత్రా శుక్లా జంట‌గా అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘రంగుల రాట్నం’. లేడి డైరెక్టర్ శ్రీ రంజ‌ని ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాల్లో ఈ మోవీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

తాజా సమాచారం మేరకు రాజ్ తరుణ్ ఈ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేసే కంపెనీలో ఉద్యోగం చేస్తాడట రాజ్ తరుణ్. లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో రాజ్ తరుణ్ నటించిన రాజుగారు సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. మొదట ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావంచింది కానీ రంగుల రాట్నం రావడంతో ‘రాజుగాడు’ సినిమా వాయిదా పడింది.