మే నెలాఖరున రిలీజ్ కానున్న ‘అందగాడు’ !


వరుస విజయాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ రీసెంట్ గా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుని మరో కొత్త సినిమాతో ‘అందగాడు’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోతున్నాడు. నూతన దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అది పూర్తైన వెంటనే మే 26న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ చూపులేని వ్యక్తిగా మెప్పించనున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది.