రాజ్ తరుణ్ “స్టాండ్ అప్ రాహుల్” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Mar 3, 2022 9:00 pm IST


హీరో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్టాండ్ అప్ రాహుల్‌. ఇందులో స్టాండ్ అప్ కమెడియన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. మేకర్స్ ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో ముందుకు వచ్చారు మరియు వర్షా బొల్లమ మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్‌, హైఫైవ్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ తో పాటుగా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :