సంక్రాతి పోటీకి సిద్దమైన రాజ్ తరుణ్ !

యంగ్ హీరోల్లో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న నటుల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఆయన చివరి చిత్రాలు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు’ వంటివి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకోవడంతో ఆయన తర్వాతి చిత్రం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ప్రస్తుతం ఈయన నూతన దర్శకురాలు సంజన రెడ్డి డైరెక్షన్లో ‘రాజుగాడు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ ఆఖరి దశలో ఉంది. రెండు పాటలు మినహా మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తైంది. వీటి కోసం త్వరలో టీమ్ థాయిలాండ్ వెళ్లనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా పూరిచేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపేందుకు సిద్ధంచేస్తున్నారు నిర్మాతలు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో రాజ్ తరుణ్ కు జోడీగా అమైరా దస్తూర్ నటిస్తుండగా అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు.