రాజ్ తరుణ్ రంగుల రాట్నం విడుదల తేది ఖరారు !

3rd, January 2018 - 11:27:22 AM

రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ‘రంగుల రాట్నం’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర శుక్లా ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా నటించింది. లేడి డైరెక్టర్ శ్రీరంజని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ లవ్ స్టోరిగా తెరకెక్కింది. ఈరోజు సాయంత్రం చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు.

‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ మళ్ళీ రాజ్‌ తరుణ్‌తో చేస్తోన్న రెండో సినిమా ఇదే అవ్వడం విశేషం. ఈ సినిమాకు సంభందించి ఇంతవరుకు ఎలాంటి పబ్లిసిటి చెయ్యలేదు. విడుదలకు 10 రోజులు ఉండడంతో ఈరోజు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.