ప్రతి పదిహేను నిముషాలకు ‘అంధగాడు’ సినిమా జానర్ మారుతుంటుందట !

21st, May 2017 - 10:00:47 AM


యువ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘అంధగాడు’. కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ చూపు లేని వ్యక్తిగా నటించారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘వెలిగొండ శ్రీనివాస్ సినిమాను చాలా బాగా రూపొందించారు. మొదట 10 నిముషాల సినిమా విన్నప్పుడు నాకు ఏదో ఆర్ట్ సినిమా చెబుతున్నాడనిపించింది. కానీ ఆ తర్వాత కథ వింటే ప్రతి 15 నిముషాలకి జానర్ మారిపోతూ థ్రిల్లింగా అనిపించింది’ అన్నారు.

అంతేగాక సినిమాలో కావాల్సినన్ని ట్విస్టులు ఉంటాయని, మంచి వినోదాన్నిస్తుందని అన్నారు. అలాగే హీరోయిన్ హెబ్బా పటేల్ తో ఇంకో 30 సినిమాలు చేయాలనుందని, ఆమెకి తనకి మధ్య అంత కంఫర్ట్ జోన్ ఏర్పడిందని అన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నింటిస్తునం ఈ చిత్రాన్ని జూన్ ఎందటి వారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నామని కూడా తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు.