రాజ్ తరుణ్ కొత్త సినిమా చాలా వైవిధ్యంగా ఉండనుందట..!

raj-tharun-new-movie
‘ఉయ్యాల జంపాల’ తో హీరోగా మారి తాజాగా ‘ఆడో రకం ఈడో రకం’ తో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్ చిన్న, కొత్త నిర్మాతలు. కొత్త దర్శకులకు ఓ మంచి చాయిస్ లా మారాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణాతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రంలో రాజ్ తరుణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండి సినిమా మొత్తానికి హైలెట్ గా ఉండబోతోందట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో రాజ్ తరుణ్ ఓ పెట్ కిడ్నాపర్ గా కనిపిస్తాడట. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ఈ వార్తకు బలం చేకూర్చేలా చాలా విభిన్నంగా ఉంది. ఇందులో రాజ్ తరుణ్ చుట్టూ పెంపుడు కుక్కలతో కూర్చొని ఉండగా కింద ట్యాగ్ లైన్ గా ‘బివేర్ ఆఫ్ కిట్టు’ అని ఉంది. త్వరలోనే ఈ చిత్రం యొక్క టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఘిబ్రన్ సంగీతం అందిస్తుండగా, ఫేమస్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.